ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమాల రఘురామ్ రెడ్డితో ఆమె వివాహం జరగనుంది. ఈ విషయాన్ని షర్మిల ఎక్స్ లో పోస్టు చేశారు. దేవుడి ఆశీస్సులతో తమ కుమార్తె వివాహం నిశ్చయమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రఘురామ్ రెడ్డి.. కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడు అని, వారంతా అమెరికా పౌరులని షర్మిల తెలిపారు.







