• Home
Sunday, September 20, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Latest

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

by AdminVoicetelugu
September 16, 2026
in Latest, Movies, Short News
0
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను. ఇలాంటి మంచి సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఈ వేడుకకు రావడానికి కారణం డైరెక్టర్ తుకారాం. ‘ఫలక్‌నుమా దాస్’ అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని కాస్టింగ్ కాల్ పెట్టాను. అప్పుడు వచ్చిన డైరెక్టర్ తుకారాం. తనకి ఇష్టమైన సినిమా ‘ఒసేయ్ రాములమ్మ’ అని చెప్పాడు. నిజంగా అలాంటి ఆన్సర్ నేను ఎవరి దగ్గర వినలేదు. తర్వాత కొంతకాలం పని చేశాక తను సొంతగా డైరెక్టర్ చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడని నాకు అర్థమై, తన ప్రయత్నాలు చేసుకోమని పంపించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా జర్నీ కొనసాగుతుంది. నా సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ అయినా మొదట తన నుంచే కాల్ వస్తుంది. తను చాలా మొండివాడు. ఈ సినిమా టైటిల్ డిజైన్‌లో కూడా తన పట్టుదల కనిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. అలాగే తనకి సపోర్ట్ చేసిన నిర్మాతలకు కూడా ధన్యవాదాలు. సినిమా చేయడానికి చాలా ప్యాషన్ కావాలి. అలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు దొరకడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి నిర్మాతలు గెలవాలని కోరుకుంటున్నాను. నాకు అయినంత సపోర్ట్ ఈ సినిమాకి చేయాలని ఉంది. ఇలాంటి టీమ్‌కి అందరం కలిసి సపోర్ట్ చేయాలి. నా వంతుగా మొదటి రోజు వెయ్యి టికెట్లు కొని అందరికీ పంచుతాను. వర్ధన్, కృష్ణప్రియ, అందరూ కూడా చాలా ప్యాషన్‌తో పనిచేశారు అనిపిస్తోంది. మ్యూజిక్ చాలా బాగుంటుంది. అందుకే T-Series వాళ్లు తీసుకున్నారు. కచ్చితంగా మీరందరూ గెలవాలి. మీ అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను.

హీరో వర్ధన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విశ్వక్ అన్న ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఎన్నోసార్లు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అడ్డంకులన్నిటినీ ప్రొడ్యూసర్లు అధిగమించారు. ఈరోజు ఎక్కడ వరకు వచ్చి ఈ వేడుక చేస్తున్నామంటే, దీనికి ప్రధాన కారణం మా నిర్మాతలు. ఈ సినిమా ఎమోషనల్‌గా నాకు చాలా కనెక్ట్ అయింది. నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. సెప్టెంబర్ 18న అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూస్తారని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ కీర్తన మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 18న సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది. అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూస్తారని భావిస్తున్నాను. విశ్వక్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. డైరెక్టర్‌ గారు చాలా అద్భుతమైన సినిమా తీశారు. కచ్చితంగా మీరు అందరూ వెళ్లి థియేటర్‌లో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది.

డైరెక్టర్ తుకారాం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విశ్వక్ అన్న నమ్మిన వారి వెంట నిలబడతారు. దానికి ఉదాహరణ ఇదే. నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. ‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజ్ కాక ముందు నుంచి విశ్వక్ తెలుసు. మా నిర్మాతలు లేకపోతే మేము ఇక్కడ వరకు వచ్చేవాళ్లం కాదు. ప్రతి అడుగులో సపోర్ట్ చేశారు. ఇది నాకు చాలా పెద్ద ఎమోషనల్ జర్నీ. నరేష్ గారు ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. ఆయన సపోర్ట్‌ని నేను మర్చిపోలేను. కృష్ణప్రియ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. వర్ధన్ చాలా కమిట్మెంట్ ఉన్న యాక్టర్. తను బలంగా నిలబడ్డాడు కాబట్టే ఈ సినిమా ఇక్కడికి వచ్చింది. అలాగే మా టీంలో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ కోసం మీరు మరొకసారి సినిమా చూస్తారు. అందరికీ పేరుపేరునా థాంక్స్.

నానాజీ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ గారితో ‘పాగల్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలు చేశానా. రెండిట్లో ఆయన నన్ను చితక్కొట్టారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. తుకారాం గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

వేదవ్యాస్ మాట్లాడుతూ.. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్ అన్నకి థాంక్యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. ‘కాగితం పడవలు’ ప్యూర్ రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విశ్వక్ సేన్ గారికి ధన్యవాదాలు. మా సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వెళ్లి థియేటర్‌లో చూస్తారని కోరుకుంటున్నాను.

నిర్మాత అంజనప్ప మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ గారికి కృతజ్ఞతలు. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. కథ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ థియేటర్‌లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

ShareTweetPin
Previous Post

ఈ నెల 18న హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కిన “హతః” టీజర్ విడుదల

Next Post

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

Next Post
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

"ఏ నిమిషానికి ఏమి జరుగునో" చిత్రం నుంచి 'ఏదో బాగుందే..' పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet
  • “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ విడుదల

    Share
    Share Tweet

Recent Updates

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

September 19, 2026
Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

September 17, 2026
‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

September 16, 2026
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

September 16, 2026
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

September 16, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.