• Home
Sunday, September 20, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Editorial

“అంతా రాములోరు చూస్కుంటారు” బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం – హీరో సంగీత్ శోభన్

by AdminVoicetelugu
September 9, 2026
in Editorial, Latest, Movies, Politics, Reviews, Short News, Sports
0
“అంతా రాములోరు చూస్కుంటారు” బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం – హీరో సంగీత్ శోభన్

“అంతా రాములోరు చూస్కుంటారు” బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం – టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ లో యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “అంతా రాములోరు చూస్కుంటారు”. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో “అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని మాట్లాడుతూ – ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన లవ్ స్టోరీతో మా “అంతా రాములోరు చూస్కుంటారు”ను నిర్మిస్తున్నాం. మా టైటిల్ లో ఉన్నట్లు అంతా రాములోరు చూసుకుంటారు. మా టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ – మా మూవీలో హీరో సంగీత్, హీరోయిన్ అనస్వర క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వీళ్ల పెయిర్ మనందరినీ మోటివేట్ చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ఒక మంచి జంట అనే ఫీల్ కలిగిస్తారు. సంగీత్, అనస్వర అంత బాగా ట్యూన్ అయ్యారు. ఈ కథను నమ్మి ఈ కథకు నేను న్యాయం చేయగలను అని నమ్మి నాకు కాల్ చేసిన ప్రొడ్యూసర్ ధీరజ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఆయనను జీవితంలో మర్చిపోలేను. ప్రొడ్యూసర్ గిరికు కూడా థ్యాంక్స్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన చిత్రమిది. రాజమండ్రికి కోనసీమకు అవతల సైడ్ తీశాము. అందుకే ఈ సినిమాలో ప్రాపర్ గోదావరి స్లాంగ్ కాకుండా ఆ స్లాంగ్ లోనే చిన్న వేరియేషన్ కనిపిస్తుంటుంది. అంతా రాములోరు చూస్కుంటారు అనే టైటిల్ మేము ఊరికే పెట్టలేదు. దాని వెనక కాన్సెప్ట్ ఉంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను లాంటి ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహాలో గోదావరి బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ స్టోరీతో “అంతా రాములోరు చూస్కుంటారు” చిత్రాన్ని నిర్మించాను. ఏడాది క్రితం ఈ కథ విన్నప్పుడు నా ఫేవరేట్ మూవీలా లైబ్రరీలో ఉండిపోతుంది అనిపించింది. మనమంతా ఈ సినిమాతో ప్రేమలో పడతాం. మ్యాడ్ సినిమా కంటే ముందే సంగీత్ తో సినిమా చేయాలని అనుకున్నాను. సరైన స్క్రిప్ట్ దొరకలేదు. ఈ కథ విన్నప్పుడు సంగీత్ కు కరెక్ట్ సబ్జెక్ట్ అనిపించింది. ప్రతాప్ ఈ సినిమాకు రాసిన స్క్రిప్ట్, రూపొందించిన విధానం నన్ను సర్ ప్రైజ్ చేసింది. కథ విన్నాక మనం సీన్స్ ఎలా ఉంటాయని ఊహించుకుంటామో సరిగ్గా అలాగే రూపొందించారు. థియేటర్స్ లో బాగా ఆడే చిత్రమిది. ఓటీటీలోకి వచ్చాక కొన్నేళ్ల పాటు చూసుకుంటారు. టైమ్ దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి చూడాలనిపించి రిపీటెడ్ గా చూస్తారు. ఈ చిత్రంలో శిరీష పాత్రకు అనస్వరను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాం. ఆరు నెలలు ఆమె వెంట పడి డేట్స్ తీసుకున్నాం. ఆమె పర్ ఫార్మెన్స్ కు ఆడియెన్స్ లవ్ లో పడతారు. యూత్ లో సంగీత్ ఉన్న ఫాలోయింగ్ చూశాక ఇలాంటి కథతో ఆయనతో సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సంగీత్ ఆ క్యారెక్టర్ లో బ్లెండ్ అయిపోయారు. సినిమా మీద ప్యాషన్ తో నాతో కలిసి ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న గిరికి థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ – మా మూవీ టైటిల్ గ్లింప్స్ మీకు నచ్చిందని నమ్ముతున్నాను. మా మూవీని కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. సినిమాలోని ప్రతి సీన్ మీకు బాగా నచ్చుతుంది. ఈ సినిమాను గోదావరి జిల్లాల నేపథ్యంతో చేశాం. అక్కడి వాతావరణం చూస్తుంటే మినీ కేరళలా అనిపించింది. అక్కడ వాళ్లు చూపించే లవ్, దొరికే ఫుడ్ చాలా బాగున్నాయి. అక్కడి స్పెషల్ స్వీట్స్ టేస్ట్ చేశాం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ఫినిష్ చేయాల్సిఉంది. మీరంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి థియేటర్స్ కు వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంలోని శిరీష, మారుతి క్యారెక్టర్స్ ను మీరు ప్రేమిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ – సండే అయినా మా మూవీ టైటిల్ గ్లింప్స్ లాంఛ్ కు వచ్చి మీరు చూపిస్తున్న లవ్ కు చాలా థ్యాంక్స్. మ్యాడ్ సినిమా నుంచి మీరు నాపై ఇలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. అదంతా రాములోరి దయ అనుకుంటాను. ఇది టైటిల్ గ్లింప్స్ కాబట్టి మూవీ గురించి ఎక్కువగా చెప్పను. నెక్ట్స్ ఈవెంట్స్ లో మాట్లాడుకుందాం. మనం దేవుడు చూసుకుంటాడు అని ఆయన మీద ఎంతో కొంత భారం పెడుతుంటాం. కానీ ఈ సినిమాలో హీరో మారుతి వందశాతం దేవుడి మీద వదిలేస్తాడు. అంతా రాములోరు చూస్కుంటారు అని నమ్మి బతికేస్తుంటాడు ఈ మారుతి. ఇది లవ్ స్టోరీతో పాటు బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈ మారుతి మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అతని మీద మీకు జాలి కలుగుతుంది, చిరాకేస్తుంది. ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనే ఫీల్ కూడా వస్తుంది. ప్రేక్షకులు ఈ పాత్రను ఓన్ చేసుకుని చూస్తారు అనే నమ్మకం కథ విన్నప్పుడే కలిగింది. నేను ఇప్పటిదాకా తెలంగాణ యాసలో సినిమాలు చేస్తూ వచ్చాను. ఆ టైప్ కాస్ట్ బ్రేక్ చేయాలనుకున్నాను. ఈ మూవీ గోదావరి యాసలో ఉంటుంది. నాకు కొత్తగా ఉంటుందని నమ్మాను. రాకాస తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలని డైలమాలో ఉన్న టైమ్ లో ధీరజ్ ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చాడు. సూర్యప్రతాప్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ లోని ఎమోషన్స్ లేయర్స్ అన్నీ నచ్చాయి. ప్రతి సీన్ ను ఊహించుకోగలిగాను. ఈ సినిమాలో ఆద్యంతం మీ ఫేస్ మీద ఒక స్మైల్ వచ్చేలా సీన్స్ ఉంటాయి. అన్నారు.

Tags: Anaswara RajanAntha Ramuloru ChoosukuntaruAntha Ramuloru Choosukuntaru title glimpseDeccanFilm movie newsDheeraj MogilineniGodavari backdrop moviesPalnati Surya PratapSangeeth ShobhanSangeeth Shobhan new movieTelugu feel good love storyTollywood movie updatesupcoming Telugu movies 2026VGB Entertainment
ShareTweetPin
Previous Post

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘పంచనామా’ ట్రైలర్

Next Post

వైఎస్‌ షర్మిల కుమార్తెకుపెళ్లి నిశ్చయం

Next Post
Wedding Bells for YS Sharmila’s Daughter Anjili Reddy

వైఎస్‌ షర్మిల కుమార్తెకుపెళ్లి నిశ్చయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet
  • “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ విడుదల

    Share
    Share Tweet

Recent Updates

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

September 19, 2026
Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

September 17, 2026
‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

September 16, 2026
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

September 16, 2026
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

September 16, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.