• Home
Sunday, September 20, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Latest

ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల

by AdminVoicetelugu
September 15, 2026
in Latest, Movies, Short News
0
ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారు, ఫస్ట్ సింగిల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరిగింది. శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదర్ ప్రసాద్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తంత్ర చిత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ… “నా స్నేహితుడు వాసు సినిమా వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. నరేష్ గారు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకు నా స్నేహితుడు వాసు దర్శకత్వం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 18న విడుదల కానున్న కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరుప్రఖ్యాతులు తీసుకుని రావలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఫస్ట్ కాపీస్ బ్యానర్ ద్వారానే నేను పరిచయం కాబడ్డాను. నాకు గుర్తింపు ఇచ్చిన ఈ బ్యానర్ పై రానున్న మిస్సింగ్ మేఘన సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా తంత్ర సినిమాకు పని చేసిన వారు ఈ సినిమాకు పని చేశారు. సినిమాను 18న మిస్ అవ్వకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సింగర్ సాకేత్ మాట్లాడుతూ… “సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి థాంక్స్. సినిమాలో పాటలతో విజువల్స్ కూడా చూసాను. పాటలు, సంగీతం, విజువల్స్ చాలా బావున్నాయి. సినిమాకు సపోర్ట్ చేస్తున్న పెద్ద వారికి థాంక్స్” అన్నారు.

నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి థాంక్స్. ఒక మంచి కుటుంబ కథను ఎంచుకుని దానిలో అన్ని జోనర్స్ ఇమర్చిన వాచస్పతి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాను మంచి మలుపులతో సినిమాను తెరకు ఎక్కించారు. ప్రేక్షకులు అంతా 18వ తేదీన సినిమా చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ… “ఈ సినిమా గురించి నేను విన్నప్పుడు సినిమాకు సంగీతం అందించడం కొంచం కొత్తగా అనిపించింది. సినిమాకు మంచి పాటలు అందించాలని అనుకున్నాను. సినిమా కోసం దర్శకులు చాలా కష్టపడ్డారు. సినిమా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ సినిమాలో పని చేసిన వారితో కలిసి చేయడం చాలా సంతోషం. సినిమాకు బెక్కం వేణు గోపాల్ గారు సపోర్ట్ ఇచ్చారు. అలరాజు గారు మంచి పాటలు అందించారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ… “ఈ సినిమా నరేష్ నిర్మించిన తరువాత నేను చూసాను. సినిమా చూసాక చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. సినిమాకు సపోర్ట్ చేయాలని అనిపించింది. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కాబోతుంది. సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నరేష్ కు, వాచస్పతికు ఈ సినిమాతో మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. సినిమాలో నటించిన అంకిత్, రామ్ కార్తీక్ అద్భుతంగా నటించారు. ధ్రువన్ సంగీతం బాగా అందించారు” అన్నారు.

చిత్ర దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ… “ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కథ. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన చిత్ర బృందం అందరికీ థాంక్స్. ఈ నెల 18న విడుదల కానున్న మిస్సింగ్ మేఘన సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికి సినిమాకు మంచి ప్రమోషన్స్ తో ముందుకు వెళ్తున్నాము” అన్నారు.

నటుడు రామ్ కార్తీక్ మాట్లాడుతూ… “నా తొలి చిత్రం నుండి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదర్ ప్రసాద్ గారితో చాలా పరిచయం ఉంది, చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత ఆయన. ఈ సినిమాకు సంగీతం అందించిన ధ్రువన్ పాటలు వల్ల సినిమా ప్రేక్షకులకి బాగా వెళ్ళింది. పాటలు పాడిన గాయకులకు థాంక్స్. నేను గతంలో సినిమా చేయడం మిస్ అయిన అయిన అందితో కలిసి ఈ సినిమాలో పని చేయడం చాలా సంతోషం అనిపించింది. నాకు బెక్కం వేణు గోపాల్ గారు మంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా తోటి నటుడు అంకిత్ తో పని చేయడం బాగా అనిపించింది. అమ్ము అభిరామి తో ఇది నా రెండవ సినిమా. దర్శకులు ఈ సినిమాకు చాలా కష్టపడి పని చేశారు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. 18న మిస్సింగ్ మేఘన సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు అంకిత్ కొయ్య మాట్లాడుతూ… “సంవత్సరం తర్వాత మీడియా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థాంక్స్. నేను ఇక్కడ ఉండటానికి కారణం దర్శకుడు వాచస్పతి గారు, ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశారు. సినిమాకు పని చేసిన బృందానికి, నిర్మాతలకు థాంక్స్. రామ్ కార్తీక్ తో పని చేయడం చాలా సంతోషం అనిపించింది. మీడియా తలుచుకుంటే ఏం చేయగలదో నా గత సినిమాలకు నేను చూసాను, ఈ సినిమాకు కూడా మీడియా మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… “నేను ఈ సినిమాకు సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం రామ్ కార్తీక్. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లు నాతో గతంలో పని చేశారు, వారు మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు. ఒక నిర్మాతకు కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం, సినిమా విడుదల తేది వరకు గట్టిగా నిలబడాలి. సినిమా అంటే డబ్బు కాదు, కొంత మంది జీవితం. ఎటువంటి కష్టం వచ్చినా సినిమా కోసం నిలబడాలి. చిన్న సినిమాలకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 18న విడుదల కానున్న కంటెంట్ ఉన్న ఈ సినిమాకు మీడియా నుండి మంచి సపోర్ట్ వచ్చి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

క్యాస్ట్ : రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు

#MissingMeghana #MissingMeghanaMovie #MissingMeghanaReleaseDate #RamKarthik #AmmuAbhirami #AnkitKoyya #VaidikaSenjalia #GoparajuRamana #RRDhruvan #ShyamKNaidu #Vachaspati #TeluguMovie #TeluguCinema #Tollywood #TeluguMovies2026 #MovieRelease #PreReleaseEvent #TeluguMovieNews

 

Tags: Ammu AbhiramiAmmu Abhirami MovieAnkit KoyyaAnkit Koyya MovieBasava EditorBekkam VenugopalDamodar PrasadFirst Copy MoviesGoparaju RamanaKD and CoLatest Telugu MoviesMissing MeghanaMissing Meghana 2026Missing Meghana CastMissing Meghana MovieMissing Meghana Movie ReleaseMissing Meghana Movie Release DateMissing Meghana Movie UpdateMissing Meghana Pre ReleaseMissing Meghana Pre Release EventMissing Meghana Release DateMissing Meghana ReviewMissing Meghana SongsMissing Meghana StoryMissing Meghana Telugu MovieMissing Meghana TrailerNew Telugu MoviesPanchumarthi Naresh BabuRam KarthikRam Karthik MovieRam Karthik New MovieRR DhruvanRR Dhruvan MusicSeptember 18 Movie ReleasesSeptember 2026 Telugu MoviesShyam K NaiduSmall Budget Telugu MoviesTelugu CinemaTelugu Film UpdatesTelugu Movie NewsTelugu Movie Pre Release EventTelugu Movie ReleasesTelugu Movies 2026TollywoodUpcoming Telugu MoviesVachaspati DirectorVachaspati MovieVaidika SenjaliaVanarajVempa KasiVenkat Baddigam
ShareTweetPin
Previous Post

మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

Next Post

టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

Next Post
టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet
  • “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ విడుదల

    Share
    Share Tweet

Recent Updates

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

September 19, 2026
Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

September 17, 2026
‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

September 16, 2026
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

September 16, 2026
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

September 16, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.