తనదైన హాస్యంతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. తన మాటలు, హావభావాలతో ఎంతోమందిని నవ్వించిన కిరణ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న వార్త నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తోంది.
కిరణ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను అక్టోబర్ 5న తిరుపతిలోని ఎస్వీఐఎంఎస్ (SVIMS) ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం.
అయితే చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.
సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కిరణ్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టత కోసం అభిమానులు, అనుచరులు ఎదురుచూస్తున్నారు.





