• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

by maran
November 2, 2026
in Latest, Movies, Short News
0
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ప్రతిష్ఠాత్మక చిత్రం #RC17 # RC2Sukku ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా సినిమా హైదరాబాద్‌లో నేడు సంప్రదాయబద్ధంగా జరిగిన పూజా ముహూర్తంతో ప్రారంభమైంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు,దిల్ రాజుతో కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. టీ-సిరీస్‌ భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వేడుకకు హాజరైన దర్శకులు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.

రామ్ చరణ్, సుకుమార్ విజయవంతమైన కలయికలో మరో కొత్త అధ్యాయానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలికింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ తెలుగు సినిమాలో ఓ మైలురాయిగా నిలిచింది. కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లు, సాంకేతిక నైపుణ్యంతో ఆ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరూ చేతులు కలపడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్ చరణ్ పూర్తిగా కొత్తగా మారబోతున్నారు. సుకుమార్ ఆయనను మునుపెన్నడూ చూడని విభిన్నమైన అవతార్‌లో చూపించనున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నీలం, ఆకుపచ్చ, బంగారు రంగుల కలయికతో రూపొందించిన అద్భుతమైన నెమలి ఈక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆర్ట్ వర్క్ లో రామ్ చరణ్ ముఖాన్ని అందంగా మిళితం చేశారు. క్రియేటివ్ బ్రష్‌స్ట్రోక్స్ పోస్టర్‌కు ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకొచ్చాయి.

మేకర్స్ విడుదల చేసిన “యు కెన్ ఇమాజిన్” అనే క్యాప్షన్ ఈ ప్రతిష్ఠాత్మక కలయికపై ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను తెలియజేస్తోంది. రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే మ్యాసీవ్ బజ్ ఏర్పడింది. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

నటీనటులు: రామ్ చరణ్

సాంకేతిక బృందం
రచన, దర్శకత్వం: సుకుమార్
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, భూషణ్ కుమార్
పీఆర్వోలు: వంశీ-శేఖర్, మాడురి మధు
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tags: ChiranjeeviMegastarRam CharanSukumar
ShareTweetPin
Previous Post

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Next Post

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

Next Post

Unlock Your Luck: Dive into NightWin's Exciting Sign-Up Bonuses

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.