ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఐదుగురు కొత్త శాశ్వత న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నూతన శాశ్వత న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జస్టిస్ తూట చంద్ర ధన శేఖర్, జస్టిస్ చల్లా గుణ రంజన్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు (కుంచం), జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఉన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ఐదుగురు న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ఇప్పటికే అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సెప్టెంబర్ 23న జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అనంతరం సెప్టెంబర్ 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నియామకాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయపరమైన వ్యవహారాల నిర్వహణకు మరింత బలం చేకూరనుంది.






