• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

ఏపీలో నాలుగు కొత్త నగర పోలీస్‌ కమిషనరేట్లు..

by KASI
October 6, 2026
in Latest
0
ఏపీలో నాలుగు కొత్త నగర పోలీస్‌ కమిషనరేట్లు..

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రజలకు చేరువగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగర పోలీస్‌ కమిషనరేట్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు కమిషనరేట్లకు ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారులు పోలీస్‌ కమిషనర్లుగా వ్యవహరించనున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్‌ 14(6) ప్రకారం కమిషనర్లకు ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ అధికారాలు కూడా కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ, పోలీసు జిల్లాల సరిహద్దులనే ఈ కొత్త కమిషనరేట్ల పరిధులుగా నిర్ణయించారు.

కొత్త కమిషనరేట్ల కోసం ప్రత్యేకంగా అదనపు పోస్టులను సృష్టించకుండా.. ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న అదనపు క్యాడర్‌ పోస్టులను సర్దుబాటు చేశారు.

రాజమహేంద్రవరం కమిషనరేట్‌ పరిధిలో సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, కొవ్వూరు సబ్‌ డివిజన్‌లు ఉంటాయి. రాజమహేంద్రవరం పోలీస్‌ కమిషనర్‌ పోస్టు కోసం టెక్నికల్‌ వింగ్‌ డీఐజీ పోస్టును మార్చారు.

గుంటూరు కమిషనరేట్‌ పరిధిలో గుంటూరు, గుంటూరు రూరల్, అమరావతి, తెనాలి జోన్లతో పాటు గుంటూరు ఈస్ట్‌, గుంటూరు వెస్ట్‌, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాలు ఉంటాయి. గుంటూరు పోలీస్‌ కమిషనర్‌ పోస్టుకు శిక్షణ విభాగం డీఐజీ పోస్టును సర్దుబాటు చేశారు.

తిరుపతి కమిషనరేట్‌ పరిధిలో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ జోన్లు, అలాగే తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీసిటీ, పుత్తూరు, నాయుడుపేట సబ్‌ డివిజన్‌లు ఉంటాయి. తిరుపతి పోలీస్‌ కమిషనర్‌ పోస్టుకు విజయవాడ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ పోస్టును మార్చారు. తిరుమల–తిరుపతిలో పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్‌, నేరాలు, వీఐపీ భద్రత, శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కమిషనరేట్‌ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

కర్నూలు కమిషనరేట్‌ పరిధిలో కర్నూలు అర్బన్‌, కర్నూలు రూరల్‌, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్‌ డివిజన్‌లు ఉంటాయి. కర్నూలు పోలీస్‌ కమిషనర్‌ పోస్టుకు పర్సనల్‌ అండ్‌ ఆర్గనైజేషన్‌ విభాగం డీఐజీ పోస్టును మార్చారు.

నాలుగు కొత్త కమిషనరేట్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ, వీఐపీ భద్రత, ప్రజా భద్రత మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఏర్పడింది.

Tags: Andhra Pradesh PoliceAP GovernmentAP PoliceBNS Section 14(6)Crime ControlGuntur PoliceGuntur Police CommissionerateKumar VishwajitKurnool PoliceKurnool Police CommissionerateLaw and OrderNew Police CommissioneratesPolice CommissionerRajamahendravaram PoliceRajamahendravaram Police CommissionerateTirumala PoliceTirupati Police CommissionerateTraffic Management
ShareTweetPin
Previous Post

Voice Weekly News

Next Post

ఏపీ: శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

Next Post
ఏపీ: శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ఏపీ: శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.