• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

గొడవలు కాదు.. అభివృద్ధే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

by KASI
October 6, 2026
in Latest, Politics
0
గొడవలు కాదు.. అభివృద్ధే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

ఎన్నికల సమయంలో తన ప్రసంగాల తీరు భిన్నంగా ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. హద్దులు దాటినప్పుడు, గొడవలు లేదా యుద్ధ పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే తన మాట, గొంతు తీవ్రంగా మారుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది శాంతి సమయమని, ప్రజలకు అభివృద్ధి అందించాల్సిన సమయమని స్పష్టం చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.30,156 కోట్ల విలువైన జల్‌ జీవన్‌ మిషన్‌–అమరజీవి జలధార ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో పవన్‌ కళ్యాణ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పులివెందుల అయినా, వైసీపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అరకు అయినా.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల ప్రభుత్వంగా వ్యవహరించదని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. రాయలసీమ పౌరుషానికి తగ్గట్టుగా ప్రస్తుతం తాను ప్రసంగించడం లేదని, రాయలసీమ అభివృద్ధికి అనుగుణంగా మాట్లాడుతున్నానని చెప్పారు. భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులు మారితే తన ప్రసంగం ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్నారు.

గొడవలు, కొట్లాటలు, గొడ్డలిపోట్లు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యువతకు మెరుగైన భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల ఆశీస్సులు, కూటమిపై ఉంచిన నమ్మకం కారణంగానే రాష్ట్రంలో ఇలాంటి భారీ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నామని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసి అండగా నిలిచినందుకు కృతజ్ఞతగా రూ.30 వేల కోట్లకు పైగా విలువైన అమరజీవి జలధార–జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు శ్రీకారం చుట్టామని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తాగునీరు తాగే సమయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు ఆ పేరు పెట్టినట్లు చెప్పారు.

రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.30,106 కోట్ల నిధులతో 50,315 పనులు చేపడుతున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ వివరించారు. వీటి ద్వారా 24,601 ఆవాసాల్లో 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, మరో 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లను ప్రతి ఇంటికీ అందించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించనుందని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.

Tags: “Not ConflictsAmarajeevi JaladharaAndhra Pradesh GovernmentAP DevelopmentAP PoliticsChandrababu NaiduCoalition GovernmentDeputy CM Pawan KalyanDevelopment Is Our Goal”: Deputy CM Pawan KalyanDrinking Water ProjectsJal Jeevan MissionKadapa DistrictPawan KalyanPotuluri? Potti SriramuluProddaturRayalaseemaRayalaseema DevelopmentRural Water SupplySafe Drinking WaterWater Supply Projects
ShareTweetPin
Previous Post

ఏపీ: శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

Next Post

ఏపీ పింఛన్ల పంపిణీ విధానంలో చిన్న మార్పు.. నవంబర్ 1 నుంచి చేతికి కొంత..

Next Post
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ప్రమోషన్లకు కొత్త డీపీసీ షెడ్యూల్

ఏపీ పింఛన్ల పంపిణీ విధానంలో చిన్న మార్పు.. నవంబర్ 1 నుంచి చేతికి కొంత..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.