• Home
Sunday, September 20, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Latest

మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

by KASI
September 15, 2026
in Latest, Politics
0
మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆళ్ల నాని రాజకీయ జీవితంలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. జగన్ ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన ఆకస్మిక మరణంతో ఏలూరు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.  ఆళ్ల నాని మృతి పట్ల మాజీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి సంతాపం తెలిపారు.. రాష్ట్రానికి ఆళ్ళ నాని చేసిన అంకితభావంతో కూడిన ప్రజా సేవ, చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు మరియు అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. ఓం శాంతి అంటూ పేర్కొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు,అభిమానులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Deeply saddened by the passing of Shri Alla Kali Krishna Srinivas (Alla Nani), former Deputy Chief Minister of Andhra Pradesh. His dedicated public service and contribution to the state will always be remembered. Heartfelt condolences to his family, supporters and admirers. May… pic.twitter.com/FA24VbHC4E

— Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2026

ShareTweetPin
Previous Post

విజయ్ సేతుపతి వ్యాఖ్యలతో తమిళనాట పొలిటికల్ హీట్..

Next Post

ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

Next Post
ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet
  • “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ విడుదల

    Share
    Share Tweet

Recent Updates

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

September 19, 2026
Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

September 17, 2026
‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

September 16, 2026
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

September 16, 2026
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

September 16, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.