ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట… రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికారులు జాబితాను రిలీజ్ చేశారు. అన్ని కేటగిరీల్లో కలపి మహిళలకు మొత్తం 50 ఛైర్మన్ స్థానాలు దక్కాయి. జనరల్ కేటగిరీ మహిళలకు 27 స్థానాలు కేటాయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మహిళలకు కలిపి మరో 23 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. అలాగే వెనుకబడిన తరగతులకు అంటే బీసీలకు అత్యధికంగా 36 స్థానాలు దక్కాయి. అందులో బీసీ మహిళలకు 14, బీసీ జనరల్ 22 స్థానాలు కేటాయించబడ్డాయి. SC వర్గానికి 14 స్థానాలు (మహిళలకు 7, జనరల్ 7), ST వర్గానికి మూడు స్థానాలు (మహిళలకు 1, జనరల్ 2) కేటాయించారు. అదేవిధంగా ఎలాంటి రిజర్వేషన్ లేని ఓపెన్ కేటగిరీ కింద 26 మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.
కేటగిరీల వారీగా పూర్తి లిస్ట్…
తొలుత ఎస్టీ కేటగిరీ కింద మూడు స్థానాలు కేటాయించారు.
- ST – మహిళ (1): గూడూరు
- ST – జనరల్ (2): ఆత్మకూరు, ఆలూరు
- SC కేటగిరీ కింద 14 స్థానాలు…
- SC – మహిళ (7): కొండపల్లి, నిడదవోలు, యలమంచిలి, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల.
- SC – జనరల్ (7): ఉయ్యూరు, నూజివీడు, కుప్పం, సామర్లకోట, పిఠాపురం, బాపట్ల, పొదిలి.
BC కేటగిరీ కింద మొత్తం 36 …
BC – మహిళ (14): జంగారెడ్డిగూడెం, నాయుడుపేట, నర్సీపట్నం, చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, పాలకొల్లు, కొవ్వూరు, గుంతకల్, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం.
BC – జనరల్ (22): కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, ఆత్మకూరు (నెల్లూరు), హిందూపురం, కమలాపురం, అద్దంకి, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, బేతంచెర్ల, నందికొట్కూరు, నంద్యాల, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేల్.
జనరల్ కేటగిరీ – మహిళ 27 స్థానాలు…
కనిగిరి, వెంకటగిరి, పలాస-కాశీబుగ్గ, నరసాపురం, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, పొన్నూరు, ఆకివీడు, పాలకొండ, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాలెం, యర్రగుంట్ల, కళ్యాణదుర్గ్, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు (యలమంచిలి టౌన్).
అన్‌రిజర్వ్డ్ – జనరల్ మొత్తం 26 స్థానాలు…
పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, తెనాలి, శ్రీకాళహస్తి, తుని, సత్తెనపల్లె, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గ్, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిపత్రి, పిడుగురాళ్ల.
ఏపీలో రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ 14వతేదీన రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపుపై అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి.






