ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు(బుధవారం) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్ను విడుదల చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ను విడుదల చేశారు. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎస్ఈసీ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈనెల 28న ఎన్నికలు జరుగనున్నాయి.
పురపాలక ఎన్నికలు..
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అక్టోబరు 28న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నామినేషన్ల గడువు: అక్టోబరు 18
ఉపసంహరణ గడువు: అక్టోబరు 21
పోలింగ్ తేదీ: అక్టోబరు 28
ఓట్ల లెక్కింపు: అక్టోబరు 30
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబరు 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబరు 3న పోలింగ్ నిర్వహించి, నవంబరు 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్: అక్టోబరు 19
నామినేషన్ల గడువు: అక్టోబరు 23
ఉపసంహరణ గడువు: అక్టోబరు 27
ఎన్నికల తేదీ: నవంబరు 3
ఓట్ల లెక్కింపు: నవంబరు 5
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబరు 26న తొలి విడత, నవంబరు 29న రెండో విడత, డిసెంబరు 2న మూడో విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తొలి విడత ఎన్నికలు..
నోటిఫికేషన్: నవంబరు 13
నామినేషన్ల గడువు: నవంబరు 17
ఉపసంహరణ గడువు: నవంబరు 21
పోలింగ్ తేదీ: నవంబరు 26
రెండో విడత ఎన్నికలు
నోటిఫికేషన్: నవంబరు 16
నామినేషన్ల గడువు: నవంబరు 20
ఉపసంహరణ గడువు: నవంబరు 24
పోలింగ్ తేదీ: నవంబరు 29
మూడో విడత ఎన్నికలు..
నోటిఫికేషన్: నవంబరు 19
నామినేషన్ల గడువు: నవంబరు 23
ఉపసంహరణ గడువు: నవంబరు 27
పోలింగ్ తేదీ: డిసెంబరు 2






