• Home
Sunday, September 20, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Editorial

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘పంచనామా’ ట్రైలర్

మూడు మరణాల వెనుక అసలు మిస్టరీ ఏంటి?

by AdminVoicetelugu
September 9, 2026
in Editorial, Latest, Movies, Politics, Reviews, Short News, Sports
0
గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘పంచనామా’ ట్రైలర్

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. ఉత్కంఠభరితమైన దర్యాప్తుతో పాటు భావోద్వేగాలు, మిస్టరీ, క్రైమ్ అంశాలను ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా మేళవించారు.

*Trailer ▶️*

తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఆది, ప్రవీణ్, జోసెఫ్ అనే ముగ్గురు అత్యంత దారుణంగా చనిపోతారు. అయితే వీళ్ల చావులను యాక్సిడెంటల్ డెత్‌గా క్లోజ్ చేస్తారు. కానీ ఈ ముగ్గురువి యాక్సిడెంటల్ చావులు కావనీ.. ఎవరో చంపేశారని వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులను మళ్ళీ ఆశ్రయిస్తారు. రెండు రోజుల్లో రిలీవింగ్ కాబోతున్న జై రామ్ అలియాస్ భరత్ ఈ కేసునే టేకప్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైమ్‌లో జై రామ్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? ఆ హంతకుడి మోటీవ్ ఏంటీ? అనేవి తెలియాలంటే సెప్టెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే.

 

ఈ సిరీస్ గురించి నిర్మాత ఉదయ బాను మాట్లాడుతూ.. ‘పంచనామా’ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో పాటు వ్యక్తిగత భావోద్వేగ ప్రయాణాన్ని కలగలిపిన కథ అని తెలిపారు. జై రామ్ నిజం కోసం చేసే ఇన్వెస్టిగేషన్ నేరాలు, అవినీతి ప్రపంచాన్ని ఎలా బయటకు తీసుకొస్తుందనేది కథలో ఆసక్తికరంగా చూపించినట్లు చెప్పారు. ప్రేక్షకులను నిరంతరం ప్రశ్నించేలా చేసే మిస్టరీతో పాటు మానవీయ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని, జీ5 ద్వారా ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

జీ5 బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నిజాన్ని వెతికే ఓ పోలీస్ అధికారి ప్రయాణం ఎలా భారీ క్రిమినల్ కుట్రను వెలుగులోకి తీసుకువస్తుందనే అంశంతో ‘పంచనామా’ రూపొందిందని తెలిపారు. సస్పెన్స్, ఎమోషన్, మిస్టరీతో పాటు బలమైన పాత్రలతో ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని, తెలుగు ప్రేక్షకులకు ఈ ఇన్వెస్టిగేటివ్ కథనం నచ్చుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.

మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ‘పంచనామా’లో భరత్ శ్రీనివాసన్‌తో పాటు శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శివాజీ రాజా మారుతి పాత్రలో, మేధా రెడ్డి ధరణిగా, చరణ్ బాబు ఆదిగా, రూప లక్ష్మి పుష్పవల్లిగా, రాధిక ప్రీతి దేవకిగా, సూర్య హరిగా, శ్రీజ దివ్యగా కనిపించనున్నారు. ఒక మరణం వెనుక దాగిన నిజం కోసం మొదలైన వేట.. చివరకు ఎలాంటి చీకటి ప్రపంచాన్ని బయటపెడుతుందో చూడాలంటే ‘పంచనామా’ కోసం సెప్టెంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags: Bharath SrinivasanBharath Srinivasan PanchanamaMohan SrivatsaPanchanamaPanchanama 2026Panchanama CastPanchanama Release DatePanchanama Streaming DatePanchanama Telugu OriginalPanchanama Telugu SeriesPanchanama TrailerPanchanama Web SeriesPanchanama ZEE5Telugu Investigative ThrillerTelugu OTT ReleasesTelugu OTT SeriesTelugu Thriller SeriesTelugu Web SeriesZEE5 OriginalsZEE5 Telugu
ShareTweetPin
Previous Post

“మా రాముడు అందరివాడు” సినిమాను థియేటర్స్ ఇచ్చి ప్రోత్సహించండి – థియేటర్ యజమానులకు నిర్మాత విజ్ఞప్తి

Next Post

“అంతా రాములోరు చూస్కుంటారు” బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం – హీరో సంగీత్ శోభన్

Next Post
“అంతా రాములోరు చూస్కుంటారు” బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం – హీరో సంగీత్ శోభన్

"అంతా రాములోరు చూస్కుంటారు" బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం - హీరో సంగీత్ శోభన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet
  • “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ విడుదల

    Share
    Share Tweet

Recent Updates

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

September 19, 2026
Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

September 17, 2026
‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

September 16, 2026
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

September 16, 2026
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

September 16, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.