• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా.. 3 దశలు.. తేదీలు ఖరారు

by KASI
October 14, 2026
in Latest, Politics
0
ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా.. 3 దశలు.. తేదీలు ఖరారు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు(బుధవారం) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్‌ను విడుదల చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్‌‌ను‌‌ విడుదల చేశారు. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అర్బన్ లోకల్‌ బాడీస్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈనెల 28న ఎన్నికలు జరుగనున్నాయి.

పురపాలక ఎన్నికలు..

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అక్టోబరు 28న పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబరు 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

నామినేషన్ల గడువు: అక్టోబరు 18

ఉపసంహరణ గడువు: అక్టోబరు 21

పోలింగ్‌ తేదీ: అక్టోబరు 28

ఓట్ల లెక్కింపు: అక్టోబరు 30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబరు 19న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించి, నవంబరు 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

నోటిఫికేషన్‌: అక్టోబరు 19

నామినేషన్ల గడువు: అక్టోబరు 23

ఉపసంహరణ గడువు: అక్టోబరు 27

ఎన్నికల తేదీ: నవంబరు 3

ఓట్ల లెక్కింపు: నవంబరు 5

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబరు 26న తొలి విడత, నవంబరు 29న రెండో విడత, డిసెంబరు 2న మూడో విడత పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

తొలి విడత ఎన్నికలు..

నోటిఫికేషన్‌: నవంబరు 13

నామినేషన్ల గడువు: నవంబరు 17

ఉపసంహరణ గడువు: నవంబరు 21

పోలింగ్‌ తేదీ: నవంబరు 26

రెండో విడత ఎన్నికలు

నోటిఫికేషన్‌: నవంబరు 16

నామినేషన్ల గడువు: నవంబరు 20

ఉపసంహరణ గడువు: నవంబరు 24

పోలింగ్‌ తేదీ: నవంబరు 29

మూడో విడత ఎన్నికలు..

నోటిఫికేషన్‌: నవంబరు 19

నామినేషన్ల గడువు: నవంబరు 23

ఉపసంహరణ గడువు: నవంబరు 27

పోలింగ్‌ తేదీ: డిసెంబరు 2

Tags: AP Local Body Elections Schedule Released
ShareTweetPin
Previous Post

ఐఏఎస్ ఆమ్రపాలి క్యాడర్ వివాదం: తీర్పును రిజర్వ్ చేసినహైకోర్టు

Next Post

బెంగళూరు పబ్‌ వివాదం.. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బదిలీ వేటు

Next Post
బెంగళూరు పబ్‌ వివాదం.. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బదిలీ వేటు

బెంగళూరు పబ్‌ వివాదం.. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బదిలీ వేటు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.