• Home
Sunday, September 20, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Latest

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

by KASI
September 19, 2026
in Latest, Politics
0
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

అనంతపురం, సెప్టెంబర్ 18: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పార్టీ నిర్మాణం ఉంటుందని తెలిపారు. అదే సమయంలో అన్ని కులాలు, మతాలను గౌరవించే విధానంతో పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

విజయదశమి అనంతరం వచ్చే ఏకాదశి రోజున పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త తరం యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రాయలసీమ అభివృద్ధి విషయంలో గతంలో అధికారంలో ఉన్న రాజకీయ కుటుంబాలను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు పరిస్థితిపై కూడా సంబంధిత రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తాను ఏర్పాటు చేయబోయే పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ప్రాధాన్యం ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. సమాజానికి మేలు చేసే యువతకు నాయకత్వ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

విద్యా రంగంలో మార్పులు తీసుకురావడంపై కూడా ఆయన పలు ప్రతిపాదనలు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ఉచిత, నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. ఐదేళ్లలో 30 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తమ విధానాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఉద్యోగం లభించే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.10 వేల అలవెన్స్ అందించే విధానాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో గంజాయి సమస్యను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని, ఔట్‌సోర్సింగ్ విధానానికి బదులుగా ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు.

ఎన్నికల్లో యువతకు 66 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని, అన్ని సామాజిక వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశం కల్పించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Tags: Promises Greater Role for YouthVijay Sai Reddy Announces New Political Party
ShareTweetPin
Previous Post

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet
  • “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ విడుదల

    Share
    Share Tweet

Recent Updates

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా.. యువతకు పెద్దపీట వేస్తా: విజయసాయిరెడ్డి

September 19, 2026
Kanumuru Ravichandrareddy about PM Modi

మోదికి కోసం ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం : కే. రవిచంద్రారెడ్డి

September 17, 2026
‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఫన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి:  హీరో సందీప్ కిషన్

September 16, 2026
“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

September 16, 2026
‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

‘కాగితం పడవలు’ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా. నా వంతుగా వెయ్యి టికెట్లు కొంటాను -విశ్వక్ సేన్

September 16, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.