13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా బీజేపీ జాతీయ మీడియా స్పోక్స్ పర్సన్ కనుమురు రవిచంద్రారెడ్డి మోదికి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్బంగా వారికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోసం ఈరోజు సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మన ప్రధానమంత్రి
శ్రీ నరేంద్ర మోదీ గారికి భగవంతుని ఆశీర్వాదం లభించాలని, ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటూ, మోదీ గారి జన్మదినమైన ఈరోజు అనగా సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా ఒక “ఆశీర్వాద దీపాన్ని” వెలిగిద్దాం.🙏 #HAPPY BIRTHDAY… pic.twitter.com/uVIKAeAq9i— K.RAVI CHANDRA REDDY (@SkymaxRavi) September 17, 2026







