• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Politics

రెబల్స్‌పై కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు

by KASI
October 21, 2026
in Politics
0
chandrababu

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఎన్నికల వ్యూహం, పార్టీ క్రమశిక్షణ, క్షేత్రస్థాయి ప్రచారంపై పలు సూచనలు చేశారు.

పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన రెబల్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేలా నాయకులు చొరవ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారిక అభ్యర్థులకు సకాలంలో బీఫారాలు అందించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అదనపు అభ్యర్థులను బరిలో నిలపడం సరికాదని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలి

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఎన్నికల్లో మద్దతు కూడగట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అధికారిక బాధ్యతలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.

కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా పార్టీ క్రమశిక్షణను పాటించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నాయకులందరూ సమష్టి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

రౌడీయిజం, అధికార దుర్వినియోగం ఆధారంగా సాగే రాజకీయాలు ఎక్కువకాలం కొనసాగవని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంతో పాటు, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.

Tags: Alliance CandidatesAndhra Pradesh GovernmentAndhra Pradesh PoliticsB FormsChandrababu Directs Alliance Leaders to Ensure Candidates’ Victory in Local Body ElectionsChandrababu NaiduDevelopment InitiativesElection CampaignGrassroots CampaigningLocal Body ElectionsMinistersMLAsNDA AllianceParty DisciplinePolitical CoordinationRebel CandidatesWelfare Schemes
ShareTweetPin
Previous Post

తిరుమలలో దర్శనం, వసతికి సిఫార్సు లేఖలు నిలిపివేసిన టీటీడీ

Next Post

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Next Post
ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా "జయహో రామానుజ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.