• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

పేదల సొంతింటి కల సాకారం.. ఆ కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు

by KASI
October 12, 2026
in Latest
0
cm chandrbabu

అమరావతి: ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ, వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్ట ప్రాంతంలో 22.31 ఎకరాల భూమిపై నివసిస్తున్న 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

సుమారు రూ.600 కోట్ల విలువైన భూమిపై పేదలకు హక్కులు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో భరోసా కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పట్టాలు అందుకున్న 939 మంది లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉండటం మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందన్నారు. ఇళ్ల పట్టాలు అందుకున్న కుటుంబాలకు అభినందనలు తెలియజేసిన ఆయన, ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి పేదలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తోందని చంద్రబాబు వెల్లడించారు. 28 నెలల పాలనలో సంక్షేమం, అభివృద్ధితో పాటు సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.

దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించడం ద్వారా వారి నివాసాలకు చట్టబద్ధమైన భద్రత కల్పించడమే కాకుండా, భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంపొందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Tags: 701 are womenAndhra Pradesh Chief Minister N. Chandrababu Naidu virtually launched the distribution of permanent house titles to 939 families residing on 22.31 acres of land in Sarvepalli Kattadevelopment initiatives and good governance.highlighting the government's focus on women's empowerment. The Chief Minister said the coalition government was fulfilling its commitments to the poor through welfare measuresNellore. The land is estimated to be worth around ₹600 crore. Of the beneficiaries
ShareTweetPin
Previous Post

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బియ్యం ధరలు

Next Post

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

Next Post
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.