తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకు సుమారు 80 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటుండగా, మరో 30 వేల మంది మరుసటి రోజు దర్శనం కోసం తిరుమలలో వేచి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు సహకరించాలని కోరింది.
* అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు…
* అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు
* అక్టోబర్ 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
* అక్టోబర్ 12న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
* అక్టోబర్ 16న శ్రీవారి బ్రహ్మోత్సవ గరుడ సేవ
* అక్టోబర్ 20న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల అవభృథం, శ్రీ వేదాంత దేశికులు శాత్తుమొర.
* అక్టోబర్ 21న బూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
* అక్టోబర్ 26న పౌర్ణమి గరుడసేవ.






