• Home
Thursday, November 5, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ విడుదల

వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో వినోదాత్మక చిత్రం

by AdminVoicetelugu
September 12, 2026
in Latest, Movies
0
‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ విడుదల

‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ విడుదల

వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో వినోదాత్మక చిత్రం

విక్టరీ వెంకటేష్, స్టార్ రైటర్-డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ తాజాగా విడుదలైంది. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్‌ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘ఆదర్శ కుటుంబం – AK47’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

సంగీతం థమన్ ఎస్, ప్రొడక్షన్ డిజైన్ ఏ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్ నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్ఠాత్మక బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పలు విజయవంతమైన, బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ సంస్థ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రంగా ‘ఆదర్శ కుటుంబం – AK47’ రూపొందుతోంది.

టీజర్‌కు లభిస్తున్న స్పందనతో పాటు వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ రైటింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్, యాక్షన్ అంశాలు, భారీ తారాగణం సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

కుటుంబ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించేలా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tags: Aadarsha Kutumbam AK47Aadarsha Kutumbam CastAadarsha Kutumbam CrewAadarsha Kutumbam MovieAadarsha Kutumbam Movie UpdateAadarsha Kutumbam Release DateAadarsha Kutumbam TeaserAadarsha Kutumbam Teaser OutAadarsha Kutumbam TrailerAK47 MovieBrahmajiEditing by Navin Noolientertaining family setupFamily EntertainerHaarika and Hassine CreationsLatest Telugu Movie UpdatesMovie TeaserNara RohithNavin NooliNivetha PethurajRaghu BabuRaj PrajwalRao RameshRavi K ChandranSatyaSrinidhi ShettyTelugu Action ComedyTelugu CinemaTelugu Comedy MovieTelugu Family MovieTelugu Movie NewsTelugu Movie TeaserTelugu Movies 2026Thaman MusicThaman STollywoodTrivikram SrinivasTrivikram Srinivas MovieUdaybir SandhuUpcoming Telugu MoviesVenkateshVenkatesh MovieVenkatesh New MovieVenkatesh TrivikramVenkatesh Trivikram CombinationVenkatesh Trivikram MovieVennela KishoreVictory VenkateshYuvina
ShareTweetPin
Previous Post

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ: అంచనాలను అందుకోలేకపోయిన రొటీన్ లవ్ స్టోరీ!

Next Post

పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

Next Post
పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Discover the Thrills of Wow Vegas Casino: Your Ultimate Gaming Guide

November 5, 2026

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.