• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

by maran
October 22, 2026
in Latest, Movies, Short News
0
ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 24న “జయహో రామానుజ” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటి, నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ – మా “జయహో రామానుజ” సినిమా ఈ నెల 24న రిలీజ్ కు వస్తోంది. సినిమాను రూపొందించడం ఒకెత్తు అయితే అది రిలీజ్ చేయడం మరో ఎత్తు. మా సినిమాకు అగ్రిసివ్ ప్రమోషన్స్ చేస్తున్నాం. ఈ నెలలో రిలీజైన పెద్ద సినిమాలతో పోటీగా ప్రమోషన్స్ చేస్తున్నాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర కూడా ప్రచారం నిర్వహించాం. సమసమాజం కోసం రామానుజాచార్యుల వారు చేసిన ప్రయత్నం ఏంటి, ఈ క్రమంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వంటి అంశాలను మా సినిమాలో చూపిస్తున్నాం. ఈ సినిమాలో నేను కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి వంటి మూడు రోల్స్ లోనూ నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. రామానుజాచార్యుల వారి జీవితం గురించి మా సినిమా ద్వారా ఇప్పటి తరానికి తెలుస్తుందని నమ్ముతున్నాం అన్నారు.

ప్రొడ్యూసర్ నాగబాల సురేష్ మాట్లాడుతూ – పౌరాణిక నేపథ్య చిత్రాలు రూపొందించడం చాలా కష్టం. రామానుజాచార్యుల వారి జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు లయన్ సాయి వెంకట్. వెంకటేశ్వరస్వామి దయ ఉంటే తప్ప ఆయన ఈ సినిమా చేసేవారు కాదు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఏపీ ఫిలింఛాంబర్ అధ్యక్షులు ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ – “జయహో రామానుజ” సినిమాలో చరిత్రనే కాదు గొప్ప సందేశాన్ని కూడా చూపించబోతున్నారు లయన్ సాయి వెంకట్ గారు. ఈ సినిమాను ప్రేక్షకులంతా చూసి ఆదరించాలి. రామానుజాచార్యుల వారి గురించి తెలుసుకోవాలని కోరుతున్నా అన్నారు.

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – ఇటీవలే హనుమాన్ అంశ్ అని బాలీవుడ్ లో ఒక గొప్ప మూవీ వచ్చింది. ఇప్పుడు తెలుగులో సాయి వెంకట్ గారు జయహో రామానుజా చిత్రంతో అలాంటి గొప్ప ప్రయత్నం చేయడం అభినందనీయం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక జరిగే విజయోత్సవాలను మనం చూస్తాం. ఇలాంటి మంచి సినిమాలు ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం అన్నారు.

బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ – మన మధ్య కుల, మత అడ్డు గోడలు వద్దు అని వెయ్యేళ్ల కిందటే చెప్పిన మహనీయుడు రామానుజాచార్యుల వారు. ఆయన జీవిత కథను లయన్ సాయి వెంకట్ రూపొందించడం గొప్ప ప్రయత్నం. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ అభినందించాలి. థియేటర్స్ లో చూసి ఆదరించాలి అన్నారు.

మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ – రామానుజాచార్యుల వారి తత్వాన్ని ఈ తరం ప్రేక్షకులకు తెలియజేసే గొప్ప ప్రయత్నం చేసిన లయన్ సాయి వెంకట్ గారికి మనందరి అభినందనలు తెలియజేయాలి. ఆయన రాఘవేంద్ర స్వామి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. మిగతా అన్ని పాత్రలను గొప్పగా అభినయించారు. లయన్ సాయి వెంకట్ ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకోవాలి. డబ్బు కోసం కాకుండా ఆర్థికంగా ఏమీ ఆశించకుండా ఒక మంచి సినిమా రూపొందించాలనే సంకల్పంతో సాయి వెంకట్ ఈ మూవీ నిర్మించారు. జయహో రామానుజా సినిమా ద్వారా ఆయన ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

ప్రొడ్యూసర్, హీరో లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – చిన్నప్పుడు రామానుజాచార్యుల వారి కథలు చదువుకున్నాను. ఆ తర్వాత కొన్నేళ్లకు పత్రికలకు రామానుజాచార్యుల వారి కథలను రాసి పంపించాను. అప్పుడే ఏదో ఒక రోజు ఆయన జీవిత కథను సినిమాగా రూపొందించాలనే సంకల్పం ఏర్పడింది. కానీ నేనే ఆ సినిమాలో రామానుజాచార్యుల వారిగా నటిస్తానని ఊహించలేదు. కులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే అని చాటిన మహనీయుడు ఆయన. ఈ సినిమాను నేను నిర్మించాలనేది రామానుజాచార్యుల వారి అభీష్టం. నేను ఈ పాత్ర వేషధారణలో తిరుమలకు వెళ్లినప్పుడు అక్కడ భక్తులు నాకు నమస్కరించడం నా జీవితంలో మర్చిపోలేని ఘటన. నేను చేయించిన పోస్ట్ ప్రొడక్షన్ నచ్చక..మా అమ్మాయి ప్రవళ్లిక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ను ఈతరం వారికి, ఇప్పటి క్వాలిటీతో పోటీపడేలా మరోసారి చేయించారు. ప్రేక్షకులంతా మా సినిమాను ఆదరించాలి. రామానుజాచార్యుల వారి గురించి తెలుసుకోవాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు వేదాల శ్రీనివాస్, అంకమ్మ చౌదరి, వ్యాపారవేత్త అశ్వాపురం వేణుమాధవ్, పీసీసీ జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ మూర్తి, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

 

ShareTweetPin
Previous Post

రెబల్స్‌పై కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు

Next Post

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరిలో హీరో విజయ్ దేవరకొండ

Next Post
“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరిలో హీరో విజయ్ దేవరకొండ

"రణబాలి"  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా - అనంతపురం రణభేరిలో హీరో విజయ్ దేవరకొండ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.