• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా ఘనంగా ‘ఇంటర్నేషనల్‌ ఇంక్‌ బౌండ్‌ 2.0’ వేడుక

by maran
October 3, 2026
in Latest, Politics, Short News
0
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా ఘనంగా ‘ఇంటర్నేషనల్‌ ఇంక్‌ బౌండ్‌ 2.0’ వేడుక

కస్తూరి విజయం పబ్లిషర్స్‌ సంస్థ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ ఇంక్‌ బౌండ్‌ 2.0 వేడుక శనివారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. కస్తూరి విజయం సంస్థ వ్యవస్థాపకులు పామర్తి సుధీర్‌ పామిరెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, రచయిత, నటుడు తనికెళ్ల భరణి, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌లు ముఖ్య అతిథిలుగా హాజర్యయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ యజ్క్షాల రచించి కస్తూరి విజయం పబ్లిషర్స్‌ ప్రచురించిన స్క్రీన్‌ప్లే మాస్టర్‌ సుకుమార్‌ పుస్తకం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ల ఎడిషన్‌లతో పాటు ప్రముఖ రచయిత వంగూరి చిట్టేన్‌ రాజు రచించిన అవేమైనా జ్క్షాపకాలా మర్చిపోవడానికి పుస్తకాలను వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. దీంతో పాటు ఈ సందర్బంగా 48 కథల సంకలనం అమ్మమ్మ కథల ఖజానా పుస్తకాన్ని కూడా పబ్లిషర్స్‌ ఆ పుస్తక రచయితల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ” పుస్తకం మధుర మధురజ్క్షాపకాల బాండాగారం.. చిట్టేం రాజు ఈ పుస్తకంలో ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. ఇక మనం మరిచిపోతున్న మన సంప్రదాయాలను కట్టు, బొట్టు, భాషలను ఈ పుస్తకంలో ఆయన గుర్తు చేశారు. ఇక ఇండియాలో కంటే ఎక్కువగా విదేశాల్లో మన సంప్రదాయాలను చక్కగా పాటిస్తున్నారు. ఇండియాలో ఉన్నవాళ్లు పాశ్చత్య సంస్కృతి పేరిట వింత పోకడలను అనుసరిస్తున్నారని ఆయన చెప్పారు. స్క్రీన్‌ప్లే మాస్టర్‌ సుకుమార్‌ పుస్తకం రావడం అభినందనీయం. సినిమాలు వినోదంతో పాటు విజ్ఞానాన్నిఅందించాలి. హ్యుమర్‌, గ్రామర్‌ ఉంటే సినిమాకు గ్లామర్‌ వస్తుంది. ఈ దిశలో సినిమా ప్రముఖులు చొరవ తీసుకోవాలి. దర్శకుడు సుకుమార్‌పై మూడు భాషల్లో పుస్తకం రావడం అభినందనీయం’ అన్నారు.
నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ ” సుధీర్‌ పామిరెడ్డి కుటుంబ సభ్యులు మంచి సాహిత్య ప్రియులు. కుటుంబం మొత్తం ఈ పుస్తకాల ప్రచురణలో ఉండటం అభినందనీయం. స్క్రీన్‌ప్లే మాస్టర్‌ సుకుమార్‌ పుస్తకం రచించిన ప్రవీణ్ యజ్క్షాల నా మిథునం సినిమా కథ-స్క్రీన్‌ప్లేపై తులనాత్మక పరిశోదనతో ఓ పుస్తకం తీసుకొచ్చాడు. సుకుమార్‌పై రాసిన పుస్తకం కూడా చదివి నా అభిప్రాయం తెలియజేస్తాను’ అన్నారు.

ShareTweetPin
Previous Post

ప్రముఖ దర్శకుడు, రచయిత బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

Next Post

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

Next Post
singeetham srinivasarao

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.