వైఎస్ఆర్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కుమార్తె అంజలికి, అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన సోముల రఘురామిరెడ్డితో వివాహం జరగనుంది. రఘురామిరెడ్డి కుటుంబ మూలాలు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురంలో వున్నట్లు సమాచారం. అంజలీకి, రఘురామిరెడ్డికి అంతకుముందే పరిచయం వుండగా, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరు కుటుంబ సభ్యులు గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న హైదరాబాద్ కొత్వాల్‌గూడలోని ఆంధ్ర కన్వెన్షన్ సెంటర్లో నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.







