• Home
Monday, September 21, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Latest

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

by AdminVoicetelugu
September 9, 2026
in Latest, Movies
0
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా

ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ

బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ‘బేబీ’ జోడీ, ’90s’ దర్శకుడి కలయికలో సితార నిర్మించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువతలో తారస్థాయి అంచనాలను ఏర్పరచుకున్న ‘ఎపిక్’ చిత్రం, సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని దస్‌పల్లా హోటల్ లో మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అభిమానులను ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. వచ్చే మూడు నెలలు రెగ్యులర్ గా కలుస్తుంటాను. సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ సినిమా ఉంది. అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ సినిమా ఉంది. నవంబర్ లో దేవరకొండ రష్మిక సినిమా ఉంది. ఇప్పుడు రణబాలి సెట్ నుంచే వచ్చాను. ఈ సంవత్సరం తెలుగు సినిమాకి చాలా చాలా బాగుంది. వరుసగా సినిమాలు విజయం సాధిస్తున్నాయి. సెప్టెంబర్ 11న ఎపిక్ వస్తుంది. ఆ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ వస్తుంది. ఆ తర్వాత రణబాలి వస్తుంది. ఆ తర్వాత మైసా, ఈ నగరానికి ఏమైంది 2, ఫౌజీ, దాదా వస్తున్నాయి. ఈ ఏడాది సాలిడ్ గా ఉండబోతుంది. ఎపిక్ తో స్టార్ట్ అయ్యి వరుస బ్లాక్ బస్టర్లు చూడబోతున్నాం. తెలుగు సినిమా మరో స్థాయికి వెళ్ళబోతుంది. ఎపిక్ విషయానికొస్తే.. ఆదిత్య అంతకుముందు ఎవరో తెలీదు. అలాంటోడు 90s వెబ్ సిరీస్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ విన్ యాప్ ను డౌన్లోడ్ చేయించాడు. 90s సిరీస్ చూసినప్పుడే అనుకున్నా, ఈ కుర్రాడు సినిమా తీస్తే ఖచ్చితంగా చూడాలని. షార్ట్ ఫిలిమ్స్ చూసి తరుణ్ భాస్కర్ డెబ్యూ కోసం ఎలాగైతే ఎదురుచూశానో, ఆదిత్య డెబ్యూ కోసం అలా ఎదురుచూశాను. నాకు తరుణ్ భాస్కర్ మొదటి సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టుగా, ఆదిత్య మొదటి సినిమాలో నటించే అవకాశం ఆనంద్ కి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆనంద్ సినిమాల ఎంపిక చూసి, నాకెంతో గర్వంగా ఉంటుంది. ఎపిక్ సినిమా ఆనంద్ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. వైష్ణవి బ్రిలియంట్ యాక్టర్. తన కుటుంబం కోసం ఎంతో చేసి, తన తల్లిదండ్రులు గర్వపడేలా చేసింది. 90s సిరీస్ చూసి నేను ఎంతో ఎంజాయ్ చేశాను. అందులోని ప్రతి పాత్ర గుర్తుంది. ఎన్నో ఙ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎపిక్ కూడా భారీ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ సమయంలో మేము అమెరికా వెళ్ళాము. అప్పుడు అక్కడ ఆనంద్ ఐటీ జాబ్ చేస్తున్నాడు. ఆ సమయంలో కలిసినప్పుడు సినిమాల గురించి మాతో మాట్లాడేవాడు. చూస్తే ఐటీ జాబ్ చేస్తున్నాడు, కానీ మాకు ఉన్నంత సినిమా పిచ్చి ఉందేంటని అప్పుడే అనుకున్నాను. కట్ చేస్తే దొరసాని సినిమాతో హీరో అయిపోయాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ సినిమాలు చేశాడు. ఆనంద్ ఏ పాత్ర చేసినా, ఆ పాత్రలో సహజంగా ఒదిగిపోతాడు. అలాగే వైష్ణవి కూడా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇక్కడివరకు వచ్చారు. 90s సిరీస్ లో మొదట సుప్పిని సుద్దపూసని చూసి నవ్వుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో పిల్లలు చూస్తుంటే, వాళ్ళతో కలిసి సిరీస్ చూశాను. ఆదిత్య గొప్పగా రాశాడు. ఒక కొత్త రచయిత రాశాడనే ఫీలింగ్ కలగలేదు. అనుభవమున్న రచయిత రాశాడు అనిపించింది. ఇప్పుడు ఎపిక్ కూడా టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. సెప్టెంబర్ 11న విడుదలవుతున్న ఎపిక్ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఎపిక్ అనేది మనందరి సినిమా. 23-26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మనకి కుటుంబం గురించి, ప్రేమ గురించి, బాధ్యతల గురించి ఆలోచనలు ఉంటాయి కదా. వాటన్నింటినీ రెప్రజెంట్ చేసిన కథ ఇది. త్రివిక్రమ్ గారు ఒక వేడుకలో ఒక మాట అన్నారు.. ఒక మామూలు కథ చెప్పాలి, కానీ బలంగా చెప్పాలి. ట్విస్ట్ లు, రక్తపాతలు లేకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే మంచి సినిమా చేయాలి అన్నారు. ఎపిక్ అలాంటి లవ్ స్టోరీనే. చాలా సహజంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకుంటారు. విజయ్ అన్న, సందీప్ రెడ్డి గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. కింగ్డమ్ సినిమాలోని అన్న అంటేనే పాట నా కోసం, విజయ్ అన్న కోసమే రాసినట్టు ఉంటుంది. విజయ్ అన్న వల్ల మా కుటుంబంలోని అందరి జీవితాలు మారిపోయాయి. నేను చదువుకోవడం కోసం అమెరికా వెళ్ళాను. ఆ సమయంలో మా కుటుంబం ఎంతో ఎమోషనల్ అయింది. ఇలా మన నిజజీవితంలో సంఘటనలే ఈ సినిమాలో ఉంటాయి. ఇందులో విలన్ ఉండడు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఆదిత్య గొప్పగా రాశాడు. చిన్న చిన్న విషయాలను కూడా వాటికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూపిస్తూ ఆదిత్య గొప్పగా తెరకెక్కిస్తాడు. 90s లాగే ఎపిక్ కూడా పెద్ద హిట్ అవుతుంది. సెప్టెంబర్ 11న ఎపిక్ విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 10న ప్రీమియర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఎవరితోనైనా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది.” అన్నారు.

కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “మా వేడుకకు విచ్చేసిన సందీప్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ధన్యవాదాలు. సందీప్ రెడ్డి గారి వర్క్ కి నేను అభిమానిని. సందీప్ రెడ్డి గారి సినిమాలు, అందులోని పాత్రలు గొప్పగా ఉంటాయి. అలాంటిది సందీప్ రెడ్డి సినిమాలో హీరో లాంటి అమ్మాయి పాత్ర నేను ఎపిక్ లో పోషించాను. అలాగే విజయ్ గారి జర్నీ స్ఫూర్తిదాయకం. పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని మనం నమ్మి, కాన్ఫిడెంట్ గా ఉండటం అనేది విజయ్ గారిని చూసి నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సితార బ్యానర్ కి, దర్శకుడు ఆదిత్యకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. హేషమ్ అబ్దుల్ వహాబ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆనంద్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆనంద్ ఏ పాత్ర పోషించినా అందులో నిజాయితీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా మీకు ఆ నిజాయితీ కనిపిస్తుంది. ఈ సినిమాలో నేను కడలి పాత్ర పోషించాను. కడలి అంటే సముద్రం. ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఎలా మన కోసం మనం నిలబడాలి లాంటి విషయాలన్నీ నేను కడలి పాత్ర ద్వారా నేర్చుకున్నాను. నా కుటుంబ సభ్యులు, నా స్నేహితుల సపోర్ట్ వలనే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న మీ ముందుకు రాబోతుంది. మేము చేసిన ఈ కొత్త ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ట్రైలర్ అందరికీ నచ్చింది. అయితే కొందరు మాత్రం 90s దర్శకుడు నుంచి ఇలాంటి కంటెంట్ ఆశించలేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజ జీవితంలో ఒకబ్బాయి, ఒకమ్మాయి మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అదే చూపించాము. అది ట్రైలర్ లో కొందరికి తప్పుగా ఎందుకు అనిపించిందో అర్థంకాలేదు. మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఒకబ్బాయి, అమ్మాయి మధ్య బంధాన్ని దర్శకుడు ఆదిత్య ఎంతో స్వచ్ఛంగా చూపించారు. సాధారణంగా సినిమాల్లో కనిపించే కుటుంబ సమస్యలు కాకుండా, అబ్బాయి అమ్మాయి మధ్య ప్రాక్టికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ను చాలా బాగా చూపించారు. గర్ల్ ఫ్రెండ్, భార్య, అమ్మ.. ఎవరిని సినిమాకి తీసుకెళ్ళినా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తల్లిదండ్రులతో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను కూడా ఇందులో చూపించాం. అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా ఇది. నేను చాలా మంచి సినిమా చేశాను. కమర్షియల్ సినిమాల్లో ఇది ఒక రకంగా ప్రయోగమని చెప్పవచ్చు. 2 గంటల 20 నిమిషాల సినిమాలో దాదాపు 1 గంట 40 నిమిషాలు ఆనంద్, వైష్ణవి పాత్రలు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ మాట్లాడుకునేది మీకు ఎంత కనెక్ట్ అయితే, సినిమా అంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది. రూరల్ తెలంగాణ నుంచి వచ్చిన ఒక సాఫ్ట్ అబ్బాయి, ఒక కాన్ఫిడెంట్ అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మన పార్టనర్ ను ఎలా చూసుకోవాలి అనేది ఈ సినిమాలో ఉంటుంది. హృదయాన్ని హత్తుకునే ఎన్నో సన్నివేశాలు ఇందులో ఉంటాయి. సెప్టెంబర్ 10న మీరు మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “90s వెబ్ సిరీస్, ప్రేమలు సినిమా సమయంలో నన్ను అందరూ ప్రశంసించారు. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ లో అసలు నెగెటివ్ అన్నదే లేదు. అలాంటిది ఎపిక్ ట్రైలర్ విడుదలైనప్పుడు ఆదిత్య హాసన్ నుంచి ఇది ఆశించలేదు అంటూ కొందరు కామెంట్స్ చేయడం చూసి షాకయ్యాను. అదే సమయంలో ఒక విషయంలో చాలా సంతోషం కలిగింది. ఆడియెన్స్ దగ్గర నుంచి రివ్యూవర్స్ వరకు ఆదిత్య ఇలా చేయడు, సినిమా చూస్తే తెలుస్తుంది అన్నారు. అక్కడ నేను గెలిచాను అనిపించింది. నా మీద ఒక నమ్మకం ఉందని అర్థమైంది. మీ నమ్మకాన్ని నిజం చేస్తూ, మీ అందరినీ సంతృప్తి పరిచేలా ఈ సినిమా ఉంటుంది. విజయ్ గారిని, సందీప్ రెడ్డి గారిని నేను ఎంతగానో అభిమానిస్తాను. సందీప్ గారి సినిమాల్లో పాత్రలు చాలా బాగుంటాయి. సమాజాన్ని బాగా అర్థం చేసుకుంటారు. నిజాయితీగా ఉంటారు. శేఖర్ కమ్ముల గారు, సందీప్ రెడ్డి గారి సినిమాల్లోని పాత్రల ప్రేరణ నాలో ఉంటుంది. నేను చూసిన సమాజం నుంచే ఈ ఎపిక్ కథ పుట్టింది. నేను రాసుకున్న ఆదిత్య పాత్రకు ఆనంద్ పూర్తి న్యాయం చేశారు. కడలి పాత్ర చేసినందుకు వైష్ణవికి థ్యాంక్స్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అన్నారు.

ప్రముఖ నటుడు శివాజీ మాట్లాడుతూ.. “ఎపిక్ సినిమా మనందరి స్టోరీ. ప్రతి జనరేషన్ స్టోరీ. హ్యూమన్ లైఫ్ కి ఎమోషన్ అనేది పర్మనెంట్. దానికి వయసుతో సంబంధం లేదు. జీవితం అంటేనే ఙ్ఞాపకాలు. సినిమా అంటేనే భావోద్వేగాలు. ఆ రెండూ కలిస్తే ఎపిక్. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి కథ వారు చూసుకుంటారు. ఇది అందరి సినిమా. ఇందులోని ప్రతి మూమెంట్ ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఇందులోని ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. అన్ని పాత్రల్లో కల్లా ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర చాలా కష్టమైనది. అలాగే వైష్ణవి చాలా బాగా నటించింది. ఇది ప్రతి ఒక్కరూ మెచ్చుకునే సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి, దర్శకుడు ఆదిత్యకి థ్యాంక్స్.” అన్నారు.

సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసినందుకు విజయ్ దేవరకొండ గారికి ధన్యవాదాలు. ఆయన సినిమాతోనే తెలుగులో నా సంగీత ప్రయాణం మొదలైంది. సెప్టెంబర్ 10న ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది నాకు ప్రత్యేకమైన చిత్రం. మొదటి సినిమాకి పని చేసిన అనుభూతిని కలిగించింది. సంగీత దర్శకుడిగా నాలోని కొత్త కోణాన్ని చూపిస్తుంది. ఈ సినిమా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రయాణంలో నాగవంశీ గారు, ఆదిత్య గారు, ఆనంద్ గారు, వైష్ణవి గారి సపోర్ట్ ను మర్చిపోలేను. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో నటుడు శ్రీనివాస్ గవిరెడ్డి, ఛాయాగ్రాహకుడు అజీమ్, గీత రచయితలు సురేష్ బనిశెట్టి, పూర్ణాచారి తదితరులు పాల్గొని ఎపిక్ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

ShareTweetPin
Previous Post

తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్‌లో ‘ మండాడి ’ చిత్రం రిలీజ్ కు రెడీ

Next Post

షర్మిల కూతురు నిశ్చితార్థ వేడుక ఎప్పుడంటే..!

Next Post
Wedding Bells for YS Sharmila’s Daughter Anjili Reddy

షర్మిల కూతురు నిశ్చితార్థ వేడుక ఎప్పుడంటే..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Magazine September

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet

Recent Updates

Weekly Voice Magazine September

Weekly Voice Magazine September

September 21, 2026
markapuram

మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

September 20, 2026
nellore

నెల్లూరు మేయర్ ఎవరు? అభ్యర్థిత్వంపై టీడీపీలో మొదలైన చర్చ

September 20, 2026
heartbreaking-incident-toddler-dies-inside-locked-car-

ఆటగా మొదలైన క్షణం.. విషాదంగా ముగిసిన జీవితం: కారులో చిక్కుకుని నాలుగేళ్ల చిన్నారి మృతి

September 20, 2026
vijayasaireddy

విజయసాయి పార్టీ వైపు అసంతృప్త నేతల చూపు?

September 20, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.