• Home
Wednesday, November 4, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs
No Result
View All Result
Voice Telugu
Home Latest

పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25 గ్లింప్స్‌ రిలీజ్- మార్చి19న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

by maran
October 24, 2026
in Latest, Movies, Short News
0
పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25 గ్లింప్స్‌ రిలీజ్- మార్చి19న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25 గ్లింప్స్‌ రిలీజ్- మార్చి19న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ ‘ఫౌజీ’లో ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టైటిల్, రిలీజ్ డేట్ పోస్టర్లతో ఈ ప్రాజెక్ట్ మంచి ఆసక్తిని రేకెత్తించింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ పాత్ర , తెలివితేటలు, అసాధారణమైన మిషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించారు.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్ 1942 మే 29న బెర్లిన్‌లో ప్రారంభమవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే చారిత్రాత్మక సమావేశాన్ని ఇందులో చూపించారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి జర్మనీ మద్దతును కోరుతారు నేతాజీ. దాదాపు రెండు శతాబ్దాల అణచివేత తర్వాత భారత్‌కు స్వాతంత్ర్యం సాధ్యమేనా అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత్ ఓడించగలదా అని హిట్లర్ ప్రశ్నించగా, స్వాతంత్ర్యం సాధించాలనే సంకల్పాన్ని ఎవరూ ఆర్పలేరని నేతాజీ గట్టిగా చెబుతారు.

సైనిక బలానికంటే ఇంటెలిజెన్స్ మరింత శక్తివంతంగా పనిచేయగలదని నేతాజీ చెప్పడంతో సంభాషణ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. తన వాదనకు బలాన్ని చేకూర్చేందుకు బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఓ అసాధారణ భారతీయ ఆపరేటివ్ కథను ఆయన పరిచయం చేస్తారు. అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించిన ఆపరేషన్ల ద్వారా ఈ వ్యక్తి బ్రిటిష్ సైనిక బలగాలను దారి మళ్లించడం, కీలక మిషన్లను అడ్డుకోవడం, వలస పాలకుల వ్యూహాలను పదేపదే చిత్తు చేయడం వంటి పనులు చేస్తున్నప్పటికీ, తన గుర్తింపును మాత్రం బయటపెట్టడం లేదని రివిల్ అవుతుంది.

ఈ పాత్రకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం అతని తెలివైన కమ్యూనికేషన్ వ్యవస్థ. భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన ఈ రహస్య కోడ్‌ను ఛేదించడం జర్మనీకి చెందిన ఎనిగ్మా కోడ్‌ను ఛేదించడం కంటే కూడా కష్టమని వివరిస్తారు. ఆ ఆపరేటివ్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, అతని అసలు గుర్తింపు ఏమిటో బ్రిటిష్ వారికి ఇప్పటికీ తెలియదని నేతాజీ వెల్లడించడం అతడిని నీడల్లో పనిచేసే ఓ బలమైన శక్తిగా నిలబెడుతుంది.

‘ఫైల్ నంబర్ 25’లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టాల్లో పాత్ర అసలు పేరు, ఐడెంటిటీకి సంబంధించిన అంశం ఒకటి. బ్రిటిష్ అధికారులకు ‘ఫౌజీ’గా తెలిసిన ఈ సైనికుడి అసలు పేరు మాత్రం రహస్యంగానే ఉంటుంది. 1932 నుంచి వలస పాలకులకు కావాల్సిన వ్యక్తిగా ఉన్న అతడిని, తన మాతృభూమిని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్న రెబల్ గా చూపించారు. ప్రస్తుతం ఆ రహస్య ఆపరేటివ్ కలకత్తాలో ఉన్నాడని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడని నేతాజీ రివిల్ చేస్తారు.

గ్లింప్స్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ అద్రిపోయింది. వలస పాలకులకు తలవంచడానికి నిరాకరించే రెబల్ సోల్జర్ గా ఆయన కనిపించారు. పెదవుల మధ్య సిగరెట్, చేతిలో భారీ తుపాకీతో ప్రభాస్ చూపించిన ఆగ్రహం, తిరుగుబాటు తత్వం పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. బ్రిటిష్ వారికి ఆయన విసిరే సవాల్‌తో గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో ప్రభాస్ నుంచి ఎలాంటి పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్షన్‌ను ఆశించవచ్చో ఈ గ్లింప్స్ రుచి చూపించింది.

‘ఫైల్ నంబర్ 25’ ప్రత్యేకత ఏమిటంటే.. కథానాయకుడి పాత్రను కేవలం శారీరక బలం, యుద్ధభూమిలో చూపించే వీరత్వానికే పరిమితం చేయకపోవడం. రహస్య ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ యుద్ధం, కోడ్ భాషలో సమాచార మార్పిడి, అసలు గుర్తింపును దాచిపెట్టడం వంటి అంశాలు కథలో ఉత్కంఠను పెంచుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాన్ని భారత స్వాతంత్ర్య పోరాటంతో మేళవిస్తూ, విలక్షణమైన చారిత్రక నేపథ్యం, అసాధారణమైన కథానాయకుడితో ‘ఫౌజీ’ ఓ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నట్లు ఈ గ్లింప్స్ సూచిస్తోంది.

ప్రభాస్ కోసం హను రాఘవపూడి ఓ విభిన్నమైన పవర్ ఫుల్ పాత్రని రూపొందించారు. చారిత్రక అంశాలు, గూఢచర్యం, దేశభక్తి, భారీ యాక్షన్ సన్నివేశాలను కలిపి ఈ కథను తెరకెక్కిస్తున్నారు.

‘ఫౌజీ’లో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సుదీప్ ఛటర్జీ, సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అనిల్ విలాస్ జాదవ్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు.

‘ఫైల్ నంబర్ 25’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ, ఓ ఆసక్తికరమైన పీరియడ్ యాక్షన్ ఎపిక్‌ను చూడబోతున్నామని ప్రామిస్ చేస్తోంది. ఈ చిత్రం 2027 మార్చి 19న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, బెంగాలీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

Tags: FaujiFauji release on March 19thHanuraghavapudiPrabhas
ShareTweetPin
Previous Post

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

Next Post

మంచు మనోజ్ ముఖ్య అతిథిగా ‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Next Post
మంచు మనోజ్ ముఖ్య అతిథిగా ‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

మంచు మనోజ్ ముఖ్య అతిథిగా ‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Telugu Magazine

    Share
    Share Tweet
  • Voice Telugu Current Affairs

    Share
    Share Tweet
  • Voice Weekly News

    Share
    Share Tweet
  • మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

    Share
    Share Tweet

Recent Updates

Unlock Your Luck: Dive into NightWin’s Exciting Sign-Up Bonuses

November 2, 2026
రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమా #RC17 ప్రారంభం

November 2, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

ఆదర్శ కుటుంబం (AK47) మూవీ రివ్యూ: వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త తరహా ప్రయత్నం

October 30, 2026
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమానత్వపు సందేశంతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించిన చిత్రం!

October 24, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • Current Affairs

© 2022 Voice Telugu | Designed by 10gminds.