• Home
Monday, September 21, 2026
Voice Telugu
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine
No Result
View All Result
Voice Telugu
Home Politics

మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

by AdminVoicetelugu
September 20, 2026
in Politics
0
markapuram

మార్కాపురం: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా తొలిసారి జిల్లా పరిషత్‌ (జెడ్పీ)గా అవతరించనుండటంతో.. తొలి జెడ్పీ చైర్మన్ ఎవరు అవుతారన్న అంశం జిల్లాలో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలు జెడ్పీ చైర్మన్ పీఠంపై ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడటంతో ఈ ప్రాంతంలో స్థానిక రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. మార్కాపురం జెడ్పీ పరిధిలో ప్రస్తుతం 21 మండలాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి సారించారు. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లాలో 990 పోలింగ్ కేంద్రాలు, 7,55,731 మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల అధికారుల సమావేశంలో వెల్లడైంది.

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడు చోట్ల కూటమి అభ్యర్థులు, ఒక చోట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో రాబోయే జెడ్పీ ఎన్నికల్లో మండలాల వారీగా ఏర్పడే రాజకీయ సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.

టీడీపీ నుంచి పలువురి పేర్లు

టీడీపీ తరఫున మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరుడు కందుల రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు ఎర్రగొండపాలెం టీడీపీ నేత డాక్టర్ మున్నే రవీంద్ర తదితరులు కూడా జెడ్పీ చైర్మన్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కందుల రామిరెడ్డి ఇటీవల మార్కాపురంలో పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

వైఎస్సార్‌సీపీ నుంచి పోటీకి ఆసక్తి

వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, వెన్న హనుమాన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కుందూరు పెద్దకొండారెడ్డి చిన్న కుమారుడు కృష్ణమోహన్‌రెడ్డి, తాటిశెట్టి వెంకట వినయ్‌కుమార్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. జంకే వెంకటరెడ్డి ప్రస్తుతం కూడా మార్కాపురం ప్రాంత రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు.

జనసేన–బీజేపీ నుంచి కూడా ఆసక్తి

కూటమిలో భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ నుంచి కూడా జెడ్పీ చైర్మన్ పదవిపై ఆసక్తి ఉన్న నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. జనసేన నుంచి ఇమ్మడి కాశీనాథ్ పేరు ముందువరుసలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. బీజేపీకి చెందిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేరు కూడా జెడ్పీ చైర్మన్ రేసులో వినిపిస్తోంది.

మార్కాపురం జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ పదవి కావడంతో.. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం జెడ్పీటీసీ స్థానాలకే పరిమితం కాకుండా జిల్లా రాజకీయ భవిష్యత్ సమీకరణాలకు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే తుది అభ్యర్థుల ఎంపిక, పార్టీ అధిష్ఠానాల నిర్ణయాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న దానిపై చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది స్పష్టత రానుంది.

Tags: Markapuram ZP ChairmanMarkapuram ZP Chairperson Race Heats Up: Leaders from Alliance and YSRCP Eye First Post in New DistrictZPTC Electionsఇమ్మడి కాశీనాథ్ఏలూరి రామచంద్రారెడ్డికందుల రామిరెడ్డికృష్ణమోహన్ రెడ్డిజంకే వెంకటరెడ్డిజెడ్పీ చైర్మన్మార్కాపురం జిల్లామార్కాపురం జెడ్పీమార్కాపురం స్థానిక సంస్థల ఎన్నికలుమున్నే రవీంద్రవెన్న హనుమాన్ రెడ్డి
ShareTweetPin
Previous Post

నెల్లూరు మేయర్ ఎవరు? అభ్యర్థిత్వంపై టీడీపీలో మొదలైన చర్చ

Next Post

Weekly Voice Magazine September

Next Post
Weekly Voice Magazine September

Weekly Voice Magazine September

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Read

  • పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    పార్టీ పుట్టకముందే విజయసాయిపై రాజకీయ దాడులు.. అసలు భయం ఎవరికి?

    Share
    Share Tweet
  • Weekly Voice Magazine September

    Share
    Share Tweet
  • మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.. విజయసాయిరెడ్డి సంతాపం..

    Share
    Share Tweet
  • టాలీవుడ్ టు గ్లోబల్ స్క్రీన్: బహుముఖ ప్రతిభతో దూసుకుపోతున్న ఆయుషి పటేల్

    Share
    Share Tweet
  • ఘనంగా “మిస్సింగ్ మేఘన” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

    Share
    Share Tweet

Recent Updates

Weekly Voice Magazine September

Weekly Voice Magazine September

September 21, 2026
markapuram

మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ ఎవరు?

September 20, 2026
nellore

నెల్లూరు మేయర్ ఎవరు? అభ్యర్థిత్వంపై టీడీపీలో మొదలైన చర్చ

September 20, 2026
heartbreaking-incident-toddler-dies-inside-locked-car-

ఆటగా మొదలైన క్షణం.. విషాదంగా ముగిసిన జీవితం: కారులో చిక్కుకుని నాలుగేళ్ల చిన్నారి మృతి

September 20, 2026
vijayasaireddy

విజయసాయి పార్టీ వైపు అసంతృప్త నేతల చూపు?

September 20, 2026
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest
  • Politics
  • Movies
  • Short News
  • Reviews
  • Editorial
  • E Magazine

© 2022 Voice Telugu | Designed by 10gminds.