ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేసింది. అలాగే ఇండియా కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేరు ప్రకటించారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి తెలంగాణ నివాసి. రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం స్వగ్రామం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1991లో న్యాయ విద్యలో పట్టా పొందారు. 2005లో గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే గోవా మొదటి లోకాయుక్తగా ఆయన పనిచేశారు.