హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో జరిగిన శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. తెల్లవారుజామున జరిగిన విద్యుత్ షాక్ కారణంగా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. మరణించినవారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గోఖులే నగర్‌లో జరిగిన ఊరేగింపులో రథాన్ని లాగుతుండగా.. అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.