నందమూరి వారి ఇంట విషాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం ఆమె మరణించినట్లు సమాచారం. రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ స్వయాన సోదరి అవుతారు. పద్మజ మరణ వార్త విని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుటుంబం హుటాహుటిన అమరావతి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది.