dasara holydays

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలకు దసరా సెలవుల షెడ్యూల్ ప్రకటించారు. ఈ ఏడాది విద్యా క్యాలెండర్ ప్రకారం, రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులు మొత్తం 9 రోజుల పాటు సెలవులు పొందనున్నారు.జూనియర్ కాలేజీల విషయంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు. వీరికి మొత్తం 6 రోజుల పాటు విశ్రాంతి లభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *