ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు మరో రెండు శుభవార్తలు చెప్పారు. మహిళలు డిజిలాకర్‌లో ఆధార్ సాఫ్ట్‌కాపీ చూపినా బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ అధికారుల్ని ఆదేశించారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్బంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇకపై మహిళలు ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపించకపోయినా.. తమ ఆధార్ కార్డును డిజిలాకర్‌లో చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు. గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీ చూపినా బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఓకే చెబుతారు. ఘాట్ రూట్లలో కూడా పథకం వర్తింపజేయాలని సూచించారు చంద్రబాబు. కాగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు.