car

కేంద్ర ప్రభుత్వం **గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ (GST)**లో కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వివిధ నివేదికల ప్రకారం, రాబోయే GST 2.0 రీఫార్మ్స్లో భాగంగా ప్రస్తుత పన్ను శ్లాబులను సవరించనున్నారు.

ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% పన్ను రేట్ల స్థానంలో కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉండే అవకాశముందని సమాచారం. ఇందులో భాగంగా 28% శ్లాబ్‌ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, 12% కేటగిరీలోని దాదాపు 99% వస్తువులను 5% శ్లాబ్‌కి మార్చే అవకాశముంది.

ప్రత్యేకంగా ఆటోమొబైల్ రంగంలో ఇది పెద్ద ఉపశమనంగా మారనుంది. చిన్న కార్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 28% GSTని 18% శ్లాబ్‌కి తగ్గిస్తే, వీటి ధరలు దాదాపు 8% వరకు తగ్గే అవకాశం ఉందని HSBC నివేదిక వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *